మార్క్సిజాన్ని నిర్థిష్ట పరిస్థితులకు నిర్థిష్టంగా అన్వయించుకోవడం ద్వారనే దాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోగలం. విప్లవాన్ని సాధించగలం. అలాంటి ప్రయత్నం తొలుత రష్యాలో లెనిన్ నాయకత్వాన జరిగింది. మహత్తర అక్టోబర్ మహావిప్లవం విజయవంతం అయింది. ఆ తర్వాత వ్యవసాయక దేశమైన చైనా కమ్యూనిస్టు పార్టీ మార్క్సిజాన్ని చైనా నిర్థిష్ట పరిస్థితులకు అన్వయించుకోవడం ద్వారా జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని సాధించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత మవో సే టుంగ్. ఆయన విప్లవోద్యమ కాలంలో అనేక రచనలు చేశారు. విప్లవానంతరం నవచైనా పునర్నిర్మాణం గురించి ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలన్నింటిని బీజింగ్ విదేశీ భాసా ప్రచురణల సంస్థ ఆంగ్లంలో పలు సంపుటాలుగా వెలువరించింది. అదే సంస్థ వాటిలోని ప్రధానమైన రచనలను ఎంపిక చేసి 'సెలెక్టెడ్ రీడింగ్స్ ఫ్రం ది వర్క్స్ ఆఫ్ మావో సే టుంగ్` అనే పేరుతో 1971లో ఒకే సంపుటంగా వెలువరించింది. ఇప్పుడు మీ ముందున్న గ్రంథం దానికే అనువాదం. |