పేరుగాంచిన విశ్వవిద్యాలయాల ఆచార్యులు, దేశ ఉన్నత న్యాయస్థానపు న్యాయకోవిదులు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు రాసిన 30 వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో ఉన్నాయి. 2015 సంవత్సర ప్రారంభకాలం నుండి దేశ పౌర సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సంఘటనల పరంపరను, వాటి లోతుపాతులను మేధావులు ఈ వ్యాసాల్లో పరిశీలించారు. సంస్కృతి, సాంప్రదాయాల ముసుగులో మన విద్యా వ్యవస్థపై జరుగుతున్న దాడిని ఈ వ్యాసాలు తూర్పారబట్టాయి. మతోన్మాద దృక్కోణం నుండి దేశ చరిత్రను తిరగరాయ ప్రయత్నిస్తున్న వైనాన్ని ఈ వ్యాసాలు దేశ ప్రజలకు తెలియజేస్తునాన్యఇ. కులం, మతం ప్రాతిపదికగా సామాజిక పెత్తనం చెలాయించాలనుకుంటున్న కుల, మతోన్మాదుల నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దేశ భవిష్యత్‌కు ఎదురవుతున్న సవాళ్ళను, ప్రమాదాలను ఎత్తిచూపుతూ ఈ వ్యాసాలు విశదీకరించాయి.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good