'చదివేందుకు ఆహ్లాదకరంగా ఉండటమేకాక, అందుబాటులో ఉండే పరిష్కారాలతో... మీకిష్టమైన పదార్థాలు తినటం మానకుండానే ఎలా బరువు తగ్గాలో చెపుతుంది.' - డిఎన్‌ఏ

'ఎటువంటి నియతాహార కార్యక్రమాలూ ఫలితాలనివ్వక నిరాశ, ఆకలితో బాధపడే సోదరీమణులందరి మన్ననా ఎంతో త్వరగా పొందింది.' - ఫెమినా

ఈ పుస్తకం మనదేశాన్ని కుదిపి వదిలిపెట్టింది. ఇది రుజుతా దివేకర్‌ నియతాహారం గురించి రాసిన మొదటి పుస్తకం. ఆమె భారతదేశానికి చెందిన క్రీడా శాస్త్రవేత్తగా, పోషకాహార నిపుణురాలిగా ఇంతకుముందే పేరు సంపాదించుకుంది. కరీనా కపూర్‌ అద్భుతమైన శరీరాకృతి వెనక ఉన్న స్త్రీ రుజుత. ఈ పుస్తకం సమోసాలూ, కబాబ్‌లూ, గులాబ్‌జామ్‌లూ తినటం మానకుండానే బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తుంది. మీరు చెయ్యవలసిందల్లా సరైన పద్ధతిలో ఆహారం తీసుకునేందుకు కొన్ని సరళమైన నియమాలు పాటించటమే. త్వరలోనే మీరు ఏం కావాలంటే అది తినగలుగుతారు - అయినా కిలోలు వదిలించుకుంటూనే ఉంటారు. ఈ పుస్తకం నిండా ఆచరణయోగ్యమైన సలహాలూ, అబ్బురపరిచే పరిజ్ఞానం, హాస్యంతో నిండిన కథలూ ఉన్నాయి. 

మతి పోగొట్టుకోకండి, బరువు తగ్గండి మీకు ఎటువంటి పదార్థాలనీ మానక్కర్లేని నియతాహారాన్ని సూచిస్తుంది.

Pages : 206

Write a review

Note: HTML is not translated!
Bad           Good