అయోధ్య ఘటనలో అద్వానీ వంటివారు కేసులు ఎదుర్కోవలసి వచ్చింది గాని గుజరాత్‌ హత్యాకాండకు మోడీపై ఎలాంటి అభియోగం అధికారికంగా నమోదుకాని స్థితి వచ్చింది. పైగా ఆయనను సమర్థుడైన ముఖ్యమంత్రిగా ఆకాశానికెత్తి ఉత్తరోత్తరా ప్రధాని అభ్యర్థిని చేశారు. ''వాజ్‌పేయి అద్వానీలతో కూడిన ప్రస్తుత తరం ముగిశాక మోడీ ప్రధాని పదదవికి అభ్యర్థిగా వచ్చినా రావచ్చు'' అని 2002లోనే ప్రముఖ చరిత్రకారుడు ఐజాజ్‌ అహ్మద్‌ ఈ పుస్తకంలోని తన వ్యాసంలో వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశం. అక్షరాల అదే జరిగింది. అయోధ్య తర్వాత పదేళ్లకు గుజరాత్‌, ఆ తర్వాత పదేళ్లకు మోడీత్వం దేశీయంగా విజయం సాధించడం హిందూత్వ రాజకీయాల్లో ఒక కొనసాగింపు. లౌకిక తత్వానికి ఒక సవాలు.

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good