మనిషి అన్నవానికి అన్నం, వస్త్రం అతిముఖ్యమైనవి అయితే ఆ తరువాత స్థానం మానసిక ఉల్లాసం ఆక్రమించుకుంటుంది. మానసిక ఆనందం లేక ఉల్లాసం పొందాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో క్రీడలలో పాల్గొనటం కూడా ఒకటి. క్రీడలలో ప్రత్యక్షంగా పాల్గోనటమే కాదు, ఆధునిక కాలంలో క్రీడలలో పాల్గొంటున్న వారిని చూచి, వారి ప్రతిభను గురించి తెలుసుకొని, వారు సాధించిన రికార్డులను ఆస్వాదించటం కూడా క్రీడల ద్వారా మానసిక ఆనందం పొందటంలో ఒక అంశమే అని భావించబడు తున్నది. క్రీడాకారులను గురించి, వారి క్రీడా కౌశలం గురించి గురించి చర్చించటం కూడా ఇందులో భాగమే. 
ముంబాయిలో జన్మించిన సచిన్ రమేష్ టెండూల్కర్ 1989 భారత పాకిస్తానల మధ్య కరాచీలో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులలో 16 సంవత్సరాల 205  రోజుల వయస్సులో మొట్టమొదటి సారిగా రంగ ప్రవేశం జరిగినప్పటి నుంచి మనదేశంలో క్రికెట్ తీరు తెన్నులే పూర్తిగా మారిపోయయనటం అతిశయోక్తి కాదు. ఇప్పటి 36 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, సచిన్ టెండూల్కర్ క్రీడా ప్రతిభ ఆ ఆటలో గల ఎన్నో హద్దులను చెరిపి వేసింది. ఇప్పటికే మేరు సగ సమాన క్రీడాకారునిగా రాణిస్తున్న సచిన్ ఇంకా ఏంటో ఎత్తుకు ఎదిగే అవకాశాలున్నాయి. అధిరోహించే శిఖరాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తక రచనలో ఎన్నో పుస్తకాలు, టీ.వి ప్రసంగాలు, దిన పత్రికలు, వర పక్ష పత్రికలు ఏంతో  ఉపయోగించాము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good