ఈ ఆధునిక కాలంలో సమాజం, అందులోని మన జీవితమూ రానురాను మరింత సంక్లిష్టం, సంక్షోభ భరితం అవుతున్నాయి. వాటినర్థం చేసుకోవడానికి మార్క్సిజం మంచి సాధనం. నిజానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మార్క్సిజాన్ని అభ్యసించడానికి ఈ పుస్తకం మంచి తొలి అడుగు.
మార్క్సిజాన్ని అభ్యసించాలనుకొనేవారు దాని జటిలతకు భయపడి ఆ ప్రయత్నాలను వాయిదా వేస్తుంటారు. మార్క్సిజాన్ని జనరంజకంగాను, సుబోధకంగానూ చెప్పగలిగినవారు అతికొద్దిమంది. వారిలో ప్రపంచ వ్యాపితంగా గుర్తింపునొందినవారు మారిస్ కారన్ ఫోర్త్, వి.జి. అఫనాసియేవ్లు. ముఖ్యంగా అఫనాసియేవ్ కారన్ ఫోర్త్ కంటే ఎక్కువ ప్రజాదరణ పొందారు. అందుకే ఈ 'మార్క్సిస్టు తత్వశాస్త్రం' ఇంగ్లీషులో ఆరుసార్లు ప్రచురించబడింది.
ఈ గ్రంథంలో గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదాలను వీలయినంత సులభంగా అర్థమయ్యేలా వివరించారు రచయిత.
పేజీలు : 332