గత 170 సంవత్సరాల కాలంలో ఆయా చారిత్రక సందర్భాల ఆవశ్యకతను బట్టి మార్క్సిస్టు సైద్ధాంతిక స్రవంతిలో అనేక భావనలు, భావాభి వర్గాలు ప్రతిపాదించబడ్డాయి. భిన్న రంగాలలోని అగ్రస్ధాయి బూర్జువా భావజాలం యొక్క సవాళ్ళను అధిగమించే క్రమంలో వాటిలోని సజీవాంశాలను మార్క్సిజం అంతర్లీనం చేసుకుంటూనే వుంటుంది. మార్క్సిజం యొక్క చలన శీలత, వివృత (Open Ended) స్వభావం మూలాన అది నిరంతరం అభివృద్ధి చెందుతూ సామాజిక సత్యాన్ని విశ్లేషణాత్మకంగా వివరించగలిగే సత్తాను స్వంతం చేసుకుంది. ఈ క్రమంలో మార్క్సిస్టు సారస్వతంలోకి వైవిధ్యమైన పరిభాష ఆంగ్లం ద్వారా మనకు చేరింది. దీనిని తెలుగులోకి అనువదించే పనిని ఎంతోమంది ప్రతిభావంతులైన మేధావులు చాలాకాలంగా చేస్తున్నారు. సమకాలీన మార్క్సిస్టు పరిభాషతో సహా మొత్తం మార్క్సిస్టు పరిభాషను ఒకచోట చేర్చి ప్రజాచైతన్యంలో భాగం చేయాల్సిన నేటి ఆవశ్యకతకు ప్రతిస్పందనే ఈ 'మార్క్సిస్టు పదకోశం'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good