సోవియట్‌ విప్లవం తర్వాత నైనా యూరపులో విప్లవాలు వస్తాయని ఆశించిన మార్క్సిస్టు మేధావులకు నిరాశ మిగిలింది. పైగా ఫాసిజం వచ్చింది. వారు ఆలోచించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. కమ్యూనిస్టులు తమ చూపునంతా ఆర్థిక, రాజకీయ రంగాలపైనే నిలిపారని, సాంస్కృతిక, ముఖ్యంగా భావజాల రంగాలను విస్మరించారని చెప్పారు. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా బలమైన సాంస్కృతిక వ్యవస్థను సృష్టించిందని కూడా చెప్పారు. ప్రపంచ పెట్టుబడి కేవలం సైనికశక్తి ద్వారా మాత్రమే కాక, ముఖ్యంగా ప్రజల మెదళ్ళను అదుపు చేయడం ద్వారా పాలిస్తున్నదని పలువురు మేధావులు చెపుతున్నారు. సోవియట్‌ పతనంలో సంస్కృతి పాత్ర చాలా ప్రధానమైనదని పలువురి వాదన. ఇటువంటి సమయంలో మరీ ముఖ్యంగా ఫాసిజం ప్రమాదం పొంచివున్న తరుణంలో ఈ విషయం గురించి అందరూ ఆలోచించాల్సి వుంది.

ఈ సందర్భంగా ఈ రంగంలో అత్యంత ప్రముఖులు, అతి ముఖ్య సమస్యలను అతి క్లుప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం. తెలుగులో బహుశా ఇది ప్రధమ ప్రయత్నం.

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good