మార్క్సిజం పుట్టుకకు ఆర్ధిక రాజకీయ నేపథ్యం, దానికి దారి తీసని భావజాల స్రవంతుల వివరణతో ఈ పుస్తకం మొదలై 1848 నుంచి 1976 దాకా వేర్వేరు దశల్లో మార్క్సిజం అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మార్క్సిజం ప్రపంచ కార్మిక వర్గ విప్లవాలు, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల వెలుగులో లెనినిజంంగా, మావోయిజంగా అభివృద్ధి చెందిన క్రమాన్ని విశ్లేషించింది.
సిద్ధాంత ఆచరణకు మర్గదర్శిగా ఉండాలనే సూత్రం ప్రకారం మార్క్సిజాన్ని రష్యా, చైనా సమాజాల్లోని నిర్ధిష్ట పరిస్ధితులకు అన్వయించి విప్లవాలను విజయవంతం చేసే క్రమంలో లెనినిజం, మావో ఆలోచనా విధానం ముందుకు వచ్చాయి. నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా సోషలిస్టు దశలోకి చేరుకోవడం, అందుకోసం దీర్ఘకాల ప్రజాయుద్ధం చైనా విప్లవ విజయానికి దారి చూపాయి. మావో ఆలోచనల్లోని ఈ భావనలను చైనా విప్లవదం తర్వాత వెనుకబడిన దేశాల విప్లవోద్యమాలన్నీ స్వీకరించాయి. సామ్రాజ్యవాద దశలో వెనుకబడిన వ్యవసాయక దేశాల్లో, వలస, అర్ధ వలస దేశాల్లో చైనా మార్గంలో విప్లవం విజయవంతమవుతుందనే అవగాహన స్పష్టమైంది. సాంస్కృతిక విప్లవం వెలుగులో ఏర్పడ్డ మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలు మొదలైన విప్లవోద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా మావో ఆలోచనా విధానాన్ని మార్గదర్శకంగా స్వీకరించాయి. ఒక క్రమంలో మావో ఆలోచనా విధానం ప్రపంచ విప్లవాలకు దారి చూపే సార్వత్రిక, సాధారణ సిద్ధాంతమనే అవగాహనకు ప్రపంచంలోని అనేక విప్లవ పార్టీలు వచ్చాయి. అందువల్ల మావో ఆలోచనా విధానాన్ని మావోయిజంగా గుర్తించడం మొదలైంది. భారత విప్లవోద్యమం కూడా మావో ఆలోచనా విధానం బదులు మావోయిజం అనే వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good