''కాపిటల్‌''లో మార్క్స్‌, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్నీ, దాని పంపిణీ విధానాన్నీ పరిశీలించే పనిచేస్తాడు. ఆ పరిశీలనా క్రమంలోనే, ఐరోపా దేశాల బానిస, భూస్వామ్య ఉత్పత్తి విధానాల్ని కూడా క్లుప్తంగా వివరిస్తాడు. అంతేగాక, ఈ 3 రకాల సమాజాలకూ పూర్తిగా భిన్నమైన ఒక 'నూతన సమాజాన్ని' కూడా ఎక్కడికక్కడ సూచిస్తూ వుంటాడు.

'మార్క్స్‌, తన పరిశీలనలో 'శ్రమ దోపిడీ' అనే 'వికృత క్రిమి'ని కొత్తగా కనిపెట్టగలిగాడు. దీనితో, 'కలిమి లేముల రహస్యం' అంతా బయటపడింది. సమస్త సమాజ రుగ్మతల మూలం అంతా తేటతెల్లమైంది.

'మార్క్స్‌, 'శ్రమ దోపిడీ'ని గ్రహించి, అంతటితో వూరుకోలేదు. దాన్ని నిర్మూలించ గల మార్గం కూడా వివరించాడు. మార్క్స్‌ ఇచ్చిన సిద్ధాంతమే 'మార్క్సిజం'. ఇది, ఉత్పత్తి సంబంధాల మీద ఆధారపడిన భౌతికవాద శాస్త్రీయ సోషలిజం!

పేజీలు : 214

Write a review

Note: HTML is not translated!
Bad           Good