ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకం ఫ్రాన్సిస్‌ వీన్‌ రాసిన మార్క్స్‌ పెట్టుబడి - రచనా క్రమం. పుస్తకం పేరులోనే ఉన్నట్లు మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం రాసిన తీరుకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవి కేవలం వివరాలు మాత్రమే కాదు. మానవాళి చరిత్రను మార్చిన పెట్టుబడి గ్రంథ రచనా కాలంనాటి చారిత్రక పరిస్థితులు, మార్క్స్‌ వ్యక్తిగత జీవిత విశేషాలు, కార్మిక వర్గ పోరాటాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పెట్టుబడిలో మార్క్స్‌ భావనలు, ఆయన పాటించిన సంవిధానం ఒక రచనగా రూపొందడం వెనుక ఉన్న ప్రపంచాన్ని ఫ్రాన్సిస్‌ వీన్‌ తన పుస్తకంలో చిత్రికపట్టారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి గ్రంథంలోని లోతులను, విస్మృతిని అర్థం చేసుకోవడం చాలా బాగుంటుంది.

పేజీలు : 79

Write a review

Note: HTML is not translated!
Bad           Good