మూలభావం మార్క్స్‌ది

'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'లో ఉన్న మూలభావం - ప్రతి చారిత్రక శకంలోనూ ఆర్థిక ఉత్పత్తి విధానమూ, దాని నుండి విధిగా ఉత్పన్నమయ్యే సామాజిక వ్యవస్థా కలిసి ఆ శకం యొక్క రాజకీయ, బౌద్ధిక (ఇంటలెక్చువల్‌) చరిత్రకు పునాదిగా వుంటాయి అనీ; తత్ఫలితంగా, (భూమి మీద ఆదిమ సమిష్టి స్వామ్యం విచ్ఛిన్న మైనప్పటి నుండి) చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర, దోపిడీదార్లకూ దోపిడీ చేయబడేవాళ్ళకూ రిగే పోరాటాల చరిత్ర, భిన్న సామాజిక అభివృద్ధి దశలలో వున్న పాలితవర్గాల మధ్య జరిగే పోరాటాల చరిత్ర అనీ, కానీ అణగదొక్కబడిన పీడిత వర్గం (కార్మిక వర్గం) తన్ను అణగదొక్కి పీడించే (బూర్జువా) వర్గం నుండి విముక్తి పొందడమనేది మొత్తం సమాజమంతటినీ దోపిడి నుండీ, పీడన నుండీ, వర్గ పోరాటాల నుండీ శాశ్వతంగా విముక్తి చేస్తే తప్ప సాధ్యం కాని దశకు వర్గ పోరాటాల చరిత్ర ఈనాడు చేరిందనీ- ఈ మూలభావం పూర్తిగా మార్క్స్‌ది, మార్క్స్‌ ఒక్కనిదే.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good