'ఆర్ధిక, తాత్విక వ్రాతపతులలో వున్న యువ మార్క్స్‌ భావాలను, పెద్దై పరిణతి చెందిన మార్క్స్‌, వాటిని హెగెల తత్వంతో సంబంధం ఉన్న ఆదర్శవంతమైన గతానికి చెందిన అవశేషాలని చెప్పి వదిలివేశాడని, చెప్పేవారిది సరైన మాట అయితే, మనం ఇప్పటివరకు చెప్పిన మార్క్స్‌ దృష్టిలో మానవ స్వభావం, పరాయితనం, క్రియాశీలత మొదలైనవి ఏకపక్షంగా చెప్పినవవుతాయి. వీరు చెప్పేదే సరైనదైతే, మనం యువ మార్క్స్‌నే పరిగణనలోకి తీసుకోవాలి. సోషలిజాన్ని తరవాతి మార్క్స్‌తో కాక ముందరి మార్క్స్‌కే జోడించాలి. ఎలాగైన, అదృష్టవశాత్తు మార్క్స్‌ను రెండుగా చీల్చవలసిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే, ఆర్ధిక, తాత్విక వ్రాతప్రతులలో మార్క్స్‌ మనిషి గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు, పెద్దవాడైన తరవాత పెట్టుబడి (కాపిటల్‌)లో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధమికంగా పెద్ద తేదా లేదు.

''ఎప్పుడైనా ఈ ప్రపంచం పాశ్చాత్య సంస్కృతి - దాని సోవియట్‌ రూపంలో, పెట్టుబడిదారీ రూపంలో, రెండింటిలోని - పతనాన్ని అధిగమించి, మానవవాద సంప్రదాయానికి పునరాగమనం చేయడం జరిగితే, మార్క్స్‌ ఒక ఛాందసుడు కాదనీ, అవకాశవాది కాడనీ, పాశ్చాత్య నాగరికత కుసుమించడాన్ని ప్రతిబింబించాడనీ, వాస్తవంగా హృదయకుహరంలోకి పోయి, ఉపరితలాన్ని చూసి మోసపోని, రాజీలేని సత్యసంధుడనీ, మనిషి, అతని భావిని గురించి గాఢంగా పట్టించుకొన్నవాడనీ, నిస్వార్ధపరుడనీ, నిగర్వి అని లేదా అధికార లాలస లేనివాడనీ, ఎప్పుడు తాను సజీవంగా ఉండి, ఇతరులను ఉద్దీపనిస్తూ, తాను తాకిన దానికెల్లా ఊపిరి పోసేవాడనీ అది గ్రహిస్తుంది. పాశ్చాత్య సంప్రదాయంలోని మంచి లక్షణాల నతడు ప్రతిబింబించాడు. హేతువులో, మానవుని ప్రగతిలో దానికున్న విశ్వాసాన్ని, వాస్తవాన్ని అతని చింతనా కేంద్రంలో వున్న ''మనిషి భావన''ను మార్క్స్‌ ప్రతిబింబించాడు''. - ఎరిక్‌ ఫ్రామ్‌ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good