మార్క్స్‌, అంబేద్కర్‌లు మానవ విమోచనను ఎలా అవగాహన చేసుకున్నారు, దానిని సాధించడానికి వారు ఎలా కృషి చేశారు అనే విషయాలను వివరించడానికి ఆనంద్‌ తేల్‌తుంబ్డే తన రచనలో ప్రయత్నించారు. అంబేద్కర్‌లోని విమోచనా దృక్పధం బౌద్ధంతో ముడిపడివున్నందున మానవ విమోచన పట్ల బౌద్ధ దృక్పధాన్ని కూడా రచయిత పరిశీలించారు.

పౌర, రాజకీయ హక్కుల సాధననే సంపూర్ణ విమోచనగా ఉదారవాద ఆలోచన పరిగణించింది. దానిని మార్క్స్‌ దాటి వెళ్ళాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ అధిగమనాంతంతరం కమ్యూనిస్టు సమాజంలో మానవసారమైన సామాజికతని మనిషి తిరిగి పొందడాన్నే విమోచనగా మార్క్స్‌ పరిగణించాడు. ఈ సైద్ధాంతిక అవగాహనలోను, దాని ఆచరణలోను వచ్చిన సమస్యలను కూడా ఆనంద్‌ తేల్‌తుంబ్డే పరిశీలించారు. అంబేద్కర్‌ కుల నిర్మూలన జరగనిదే ఏ సమూల మార్పు సాధ్యం కాదని భావించాడు. కులం పునాదులపై జాతిని, నీతిని నిర్మించలేమని స్పష్టంగా ప్రకటించాడు. దళితుల విమోచన ఆయన ప్రధాన లక్ష్యం. హిందూ సమాజంలో ఈ మార్పు సాధ్యంకాదని గ్రహించిన అంబేద్కర్‌ విమోచనకు మార్గంగా బౌద్ధాన్ని యెంచుకున్నాడు. మత మార్పిడి అంబేద్కర్‌ ఆశయాన్ని నెరవేర్చలేదు. ఇలా ఎందుకు జరిగిందో రచయిత విశ్లేషించారు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good