ఈ కథలన్నీ ఎన్నియుగాలైనా వసివాడనివి. స్ఫూర్తిమంతమైనవి. ఒక్కో పాత్రా వ్యక్తిత్వవికాస దర్పణమవుతుంది. భారత భాగవత రామాయణాది గ్రంథాలలో అలాంటి సమున్నత వనితా పాత్రలెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఎంతో శ్రమకోర్చి గుదిగుచ్చి కథనాత్మకశైలిలో వెంటాడే వాక్యాలతో తీర్చిదిద్దటమంటే మాటలు కాదు. ఈ పుస్తకంలో ఎంచుకున్న స్త్రీ మూర్తులంతా మహోన్నత వ్యక్తిత్వం పుణికి పుచ్చుకున్నవారే.

దిక్పాలకులను కూడా కాదని నలుణ్ని ప్రేమించి పెళ్లాడిన అసమాన సౌందర్యరాశి దమయంతి. స్త్రీ శక్తికి, మేధాసంపత్తికి గొప్ప ప్రతీక.

అహంకారం హద్దులు మీరితే ఏమౌతుందో దేవయాని జీవితం చెబుతుంది. శకుంతల విశిష్ట వ్యక్తిత్వం కలిగిన స్త్రీ మూర్తిగా కనిపిస్తుంది. కణ్వాశ్రమంలో పెరిగిన కోమలమైన శకుంతల దుష్యంతుణ్ని వివాహమాడినపుడు ఆమెలో స్వతంత్ర ప్రవర్తన కన్పిస్తుంది. అది తప్పుగా భావించదు. ప్రేమించిన వాడిని పెళ్లాడేందుకు వెనుకాడదు. ఆమె మాటల్లో నిర్భీతి, స్థిరత్వం, వాక్పటిమ, స్పష్టత గోచరిస్తాయి....

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good