డాకూ మంగళ్‌సింగ్‌ పునర్జన్మే మీరని అంటున్నారు కదా. గత జన్మలోని ప్రతి విషయం మీకు గుర్తుందా?'' వైట్‌హెడ్‌ అడిగాడు.

''ఈ జన్మలోని ప్రతి విషయమే మనకి గుర్తుండకపోవచ్చు''

''పోనీ కొన్ని ముఖ్య విషయాలు?''

''ఉన్నాయి''

''గత జన్మలో మీ భార్య రత్నాబాయి... ఆమెని చూడాలనిపించడం లేదా? ముఖ్యంగా మీ కొడుకుని?''

''గత జన్మలోని నా అరాచకాల్ని, అకృత్యాల్ని ప్రక్షాళన చేసుకుకోవడానికి ఈ జన్మ ఎత్తాను. అందుకని సాధ్యమైనంత వరకూ గతజన్మ తాలూకు విషయాల్ని మరచిపోవాలనే అనుకుంటున్నాను.''

''దేవుడి అదేశానుసారం మీరు నాయకుడిగా మారాలనుకుంటున్నారని చెప్పారు. ఆ ఒక్కకారణమూ మీ గత పాపాల్ని హరించి వేస్తుందా? అర్హతనిస్తుందా?''

''గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో నన్నెలా అనర్హుడ్ని చేస్తాయి? ఆ మాటకొస్తే ఈ జన్మలో చేసిన పాపాలే ఒక వ్యక్తి నాయకుడు అవడానికి అనర్హం కావు. ఆ విషయం పూలన్‌దేవికి ఓటేసి జనమే నిరూపించారు కదా!... ఆమె వ్యక్తిగత జీవితం గురించి కాదు నేను మాట్లాడేది! జాతీయ విధాన అవగాహన గురించి. పూలన్‌దేవి ప్రధానమంత్రి, హర్షద్‌మెహతా ఆర్ధికమంత్రి. ఆటో శంకర్‌ రవాణాశాఖామాత్యులు. చార్లెస్‌ శోభరాజ్‌ ¬మ్‌ మినిస్టరు అవడా                                     నికి సౌలభ్యం వున్న ఈ ప్రజాస్వామ్యంలో నాదో పెద్ద అనర్హత అనుకోను...''

బృహస్పతి అనే అపూర్వమైన తెలివితేటలున్న ఓ యువకుడిని అతడి తల్లిదండ్రులు (ఆ తెలివితేటలను భరించలేక) ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అడవిలో హఠాత్తుగా అతడికి తన పూర్వజన్మ గుర్తొస్తుంది. క్రితం జన్మలో తాను బందిపోటు దొంగైన మంగళ్‌సింగ్‌నని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో తనతోపాటు దోపిడీలు చేసిన ముగ్గురు దొంగలూ ఇప్పుడు కేంద్రమంత్రులుగా ఉన్నారని తెలుసుకున్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడు? సెటైర్‌ని జోడించి వర్తమాన రాజకీయాలపై యండమూరి వీరేంద్రనాథ్‌ ఎక్కుపెట్టిన నవలాస్త్రం - ''మరోహిరోషిమా''

Write a review

Note: HTML is not translated!
Bad           Good