మిత్రుడు ఉప్పల అప్పలరాజు ఇరవై ఏళ్ళకు పైగా తెలుసును. కేవలం వ్యక్తికాదు. అతని కవిత్వమూ తెలుసును, కావ్య వ్యక్తీకరణా తెలుసును. తొలి కావ్యానికి నేనే ముందు మాటలు రాసినట్లు గుర్తు. ఆనాటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పల రాజు నిరంతరం కృషిచేస్తూ కవితాభివ్యక్తిలో బాగా రాటు తేలాడు ఈ ప్రయాణంలో సాధించినవి వివేచనాజ్ఞానాన్ని మానవ సమూహ ప్రయాణానికి అన్వయించి ఇంత చక్కని దీర్ఘ కవిత రాసాడు. విషయంగాని, నడక గాని, నాణ్యతగాని తగుపాళ్ళలో సమకూరాయి. "గుహలు నుంచి మహలుదాకా" మానవ జీవిత ప్రయాణం మీద అప్పలరాజు వ్యక్తీకరణ కొత్తగా నెత్తావిలా సమకూరింది. ఈ "ప్రస్థాన అవసరం గురించీ, ప్రస్థాన ప్రతిఫలం గురించీ మహా ఘొషను మోస్తూ భువన ఘోషను రేపుతూ-నేను నడుస్తూనే వున్నాను" అంటూ సాగిన ఈ కవిత ఆహ్లాదాన్నిచ్చింది. "కావ్య రూపికాలాస్యం-నటనావైదుష్యం - కాలకాంతతో సంభోగ భోగం.. జీవితమే ప్రయోగం.. ఒక తీరని యాగం" అంటున్న అప్పలరాజు ఆలోచనాలోచనం వెన్నెలకు తెరవేసి, సూర్యుడికి తెరతీస్తుంది. మానవనాగరికత ఏ గోళంవేపు పయనిస్తుంది. అంతరిక్షంలోని అమృత గోళం వేపా..? అగ్ని గోళం వేపా..? చేకటి గుహలనుంచి, శ్వేత ప్రపంచ రక్తనదీ ప్రవాహాలవరకూ మనిషి ఎటునడుస్తున్నాడు...ఏమి ఆశిస్తున్నాడు..ఏమి సాధిస్తున్నాడు...గుండెలపై గులాబీలునావారు, బోసినవ్వులు రువ్వినవారు, చూపుడువేలుతో నిలిచిన శిల్పాలు మానవుని కేం నేర్పుతున్నాయి...ఎటు వెళుతున్నాడు...ఏవూరికీ ప్రయాణం...ఏ ఆదర్శం ప్రమాణం... వీచిన భావజాలమంతా కవిత్వంగా పరిమళించేటట్లు" శ్రమించి విరచించిన సుమ గీతిక ఇది. నామాట నిజమేనని అంగీకరిస్తారు.. చదివిచూడండి..!
- చందు సుబ్బారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good