"జ్ఞానతృష్ణ ఉన్నవారి కోసమే ఈ పుస్తకం. తమ మేధకు అతీతంగా వెళ్లి ఆత్మజ్ఞాని అయిన గురువు యొక్క జ్ఞానం ద్వారా జ్ఞానోదయం పొందాలనుకునే వారికీ ఇది ఒక ఒయాసిస్ వంటిది."--- ది టైమ్స్ ఆఫ్ ఇండియా
"సద్గురుని కలిసిన ఆ క్షణం నా జీవితాన్ని నిర్వచించిన క్షణం. అది జీవితం పట్ల, దానిలో ఎదురయ్యే సవాళ్ళ పట్ల నాకున్న దృక్పధాన్ని మార్చివేసింది. సద్గురు యొక్క జ్ఞాన, వివేక సారాల అందమైన సమాహారమే ఈ మర్మజ్ఞ విలాసం."
- రవి వెంకటేశన్, మాజీ చైర్మన్, మైక్రోసాఫ్ట్ ఇండియా
"మర్మజ్ఞ విలాసం ఆలోచనలను రేకెత్తించే, స్పూర్తినిచ్చే ఒక మనోహర పఠనం. ఒకరు తన ఆస్తిత్వం మధ్యలోకి చేసే తీర్ధయాత్రాకు ఇది ఆరంభం."
- డి.ఆర్. కార్తికేయన్, మాజీ డైరక్టర్ జనరల్. (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ & నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్.)
అంతుపట్టని మర్మజ్ఞుడైన సద్గురు ఈ పుస్తకంలో జీవితం, మరణం, పునర్జన్మ, బాధ, కర్మ ఇంకా ఆత్మజ్ఞానం కోసమై సాగించే ప్రయాణాల గురించి వివరిస్తూ పాఠకులను ఉత్కంఠ భరితులను చేస్తారు.
సద్గురు నిర్మొహమాట, నిష్కపట, నిరాడంబర రీతిలో ధర్మం, మతం, నైతికతల పట్ల సాధారణంగా మనకు ఉండే అభిప్రాయాలను పటాపంచులు చేస్తూ, పిరికివారు ఏ మాత్రం ఆలోచించలేని విషయాల గురించి ఆలోచించేలా పాఠకులను ప్రేరేపిస్తారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good