అంతర్జాతీయ మార్కెట్‌ అనుసంధానంతో వ్యాపార పంటల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వ్యాపార పంటలు వేసిన రైతాంగానికి మార్కెట్‌ ఒడిదుడుకులు మృత్యుపాశంగా మారుతున్నాయి. వ్యవసాయదారులు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. భూస్వాములు, పెద్ద ధనిక రైతులు ఈ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలుగుతున్నా, మిగతా రైతాంగం అప్పులపాలై చితికిపోతోంది. చాలామంది భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. కొంతమంది ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత వ్యవసాయంలో, రైతాంగంలోని భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని, చీలికలను ఇంకా వేగిరపరిచింది. అందుకే అధ్యయనం అవసరం ఇంకా పెరిగింది. అందుకే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యమకారులకు, అలాగే గ్రామీణ జీవితాన్ని అర్థం చేసుకోవాలనే ఆసక్తి కలిగిన ఇతరులకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.

పేజీలు : 383

Write a review

Note: HTML is not translated!
Bad           Good