మార్గదర్శకులు - జీవిత పరమార్థాన్ని గురించిన సంభాషణ - ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌తో అరుణ్‌ కె. తివారి
నేను ఏ విధంగా రూపొందుతాను? సంఘర్షణ, బాధలు నిండిన ఈ ప్రపంచంలో ఏ విధంగా నిలబడగలను? నిత్యజీవితంలోని ఒత్తిడిని ఏ విధంగా తట్టుకోగలను? ఏ విధంగా నా జీవితం సంతోషంగాను, ఉపయోగకరంగాను ఉండగలదు? విద్యార్థులు, యువ వృత్తి నిపుణులు దార్శనికత గల్గిన భారత రాష్ట్రపతి ఎక్కడికెళ్ళినా తరచు ఇదే విధంగా ప్రశ్నిస్తుంటారు ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ''మార్గదర్శకులు: జీవిత పరమార్థాన్ని గురించిన సంభాషణ'' సమాధానం ఇస్తుంది.
డా|| ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం - అతని మిత్రుడు 'వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌' సహ రచయిత ప్రొ|| అరుణ్‌ కె. తివారిల మధ్య జరిగిన సంభాషణలతో రూపొందిన ఈ పుస్తకం జీవితానికి ఆధ్యాత్మికమైన మార్గాన్ని చూపిస్తుంది. యువత యొక్క నిర్మలమైన సృజనాత్మకతను తట్టి లేపే యీ పుస్తకం రెండు అతివాదాలైన - ప్రపంచీకరణ యొక్క అతినీ, ప్రపంచాన్ని ఒక సంఘర్షణ వేదికగా దర్శించే నైరాశ్యాన్నీ తిరస్కరిస్తూ, మానవజాతి పరమాశయం - భూమండలం మీద జరిగే పరిణామ ప్రక్రియకు సహాయపడటమేనన్న సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.
ఈ పుస్తకం చరిత్ర నుండి మానవజాతి క్రియాశీలత వరకు విస్తృతమైన విషయాలను చర్చిస్తుంది. ఈ భూమిపై నడచిన కొద్దిమంది గొప్ప మానవమూర్తులు, ఆదర్శాలకు ఉదాహరణగా నిలిచిన వారి భావనలు వివరిస్తూ ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good