'ఎక్కడికి వెళ్తున్నాం ?'' అని అడిగింది అటూఇటూ చూస్తూ. జవాబుగా సలీం జేబులోంచి ఆసిడ్‌ సీసా తీసాడు.

ఆమెకి మొదట అర్ధం కాలేదు. అంతలో శంకర్‌ మొహం మీద వికృతమైన నవ్వు కనబడింది.

''నువ్వు చాలా తెలివైన దానివటగా ! మీ ఆఫీసులో అంతా అలాగే చెప్పుకుంటారుట'' అన్నాడు.

''ఎవర్నువ్వు'' అంది.

ఆ ప్రశ్నకి అతడు సమాధానం ఇవ్వలేదు. ''తెలివైనవాళ్ళు పడక మీద మంచి సుఖం ఇస్తారని నాకో గొప్ప నమ్మకం'' అన్నాడు.

అప్పుడు అర్ధమయింది ఆమెకి అతడు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కాదని. జీపు వేగంగా వెడుతోంది.

''నా పేరు శంకర్‌... సలీం శంకర్‌'' అన్నాడు అతడు. ఆమె గుండె ఆగిపోయిందో క్షణం. స... లీం.. శం... క... ర్‌ . రేపు కోర్టులో నేరం నిరూపణ అయితే శిక్ష పడవలసిన బోస్టన్‌ స్ట్రాంగ్లర్‌!! తన పక్కన.

''ఇదేమిటో తెలుసా ? ఆసిడ్‌ సీసా'' అన్నాడు ఒక చేత్తో మూత తీస్తూ. ''చుక్క పడితే చాలు, చర్మం సలసలా కాలిపోతుంది''.

ఆమె మెదడు ఆలోచించే శక్తి కోల్పోయింది...

వెరైటీ కోసం రకరకాల స్థలాల్లో రేప్‌ చేయటానికి ఉవ్విళ్ళూరే నరరూప ర్షాసుడు సలీంశంకర్‌. చీకటి ప్రపంచాన్ని తన చూపుడు వేలితో శాసించగల మాఫియా లీడర్‌ వసంత్‌దాదా.

తమ ఉనికికి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మారణహోమం సృష్టించే ఆ రక్తదాహపు క్రూరారణ్యంలోకి పొరపాటున అడుగుపెట్టింది లేడికూనలాంటి అనూష. అనుకోకుండా ఆ బేలకి భయంకరమైన రహస్యం ఒకటి తెలిసింది. అది గనక బయటికి పొక్కిందా వసంతదాదా చీకటి సామ్రాజ్యమే కుప్పకూలిపోతుంది. దాన్ని నివారించడానికి సలీంశంకర్‌ రంగంలోకి దిగాడు. మరణమృదంగ ధ్వని ప్రళయకాల ప్రభంజనంలా అనూషని వెంటాడింది...

మొదటి పేరా నుండి చివరి అక్షరం దాకా ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్‌తో పాఠకుల్ని మెస్మరైజ్‌ చేసే యండమూరి వీరేంద్రనాథ్‌ థ్రిల్లర్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good