మిగతా ఆడవాళ్ల కంటే ఎత్తుగా పుష్టిగా వుండే ఆమె నడుం పొడుగ్గా వుంటుంది. అల్లనేరేడు పండురంగు శరీరం. కంబాల చెరువుల్లాంటి కళ్ళు. అత్తరూ, పునుగూ సువాసనల గురించి అసలెరగని ఆమె శరీరం ఎప్పుడూ పరిమళాల్లో గుభాళిస్తానే వుంటుంది. ఆమె నవ్వితే గురుపౌర్ణమి నాటి వెన్నెల అక్కడ పరుచుకుంటుంది. ఏడిస్తే ఆఖండ గోదావరక్కడ పొంగి పొర్లిపోతుంది.

''మా వూరి కొండలోపలున్న అమ్మోరి పేరు జోకలమ్మ. మా తొలకరి వైశాఖంలో మొదలవ్వుద్ది. ఆవిడకి నరబలిచ్చిగానీ మేం పంట పనులు మొదలెట్టం...మీ వూళ్ళో నరబలికి పిల్లల్ని అమ్ముతారని తెల్సి వచ్చాను,'' అన్నాడు.

Pages : 198

Write a review

Note: HTML is not translated!
Bad           Good