మనుస్మృతి గురించి విననవివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి శాస్త్రీయంగా చేసిన శస్త్ర పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా చెడేనా? లేక సమర్థకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మంచి విషయాలేనా? వాస్తవానికి ఈ రెండూ పూర్తి నిజాలు కావు. రెంటిలోనూ కొంత మాత్రమే నిజం. గతితార్కిక దృక్పథంతో, ఆధునిక శాస్త్ర విజ్ఞానం వెలుగులో మనువు చెప్పిన విషయాలలోని మంచి చెడుగులను లోతుగా విశ్లేషించిన తులనాత్మక అధ్యయనమిది. పన్నెండు అధ్యాఆయల ఆ బృహద్గ్రథం మొదటి మూడు అధ్యాఆలలోని మొత్తం 654 శ్లోకాలపై చేసిన సమగ్ర శాస్త్రీయ విశ్లేషణ ఇప్పుడు మొదటి భాగంగా మీ ముందుంది. మరో రెండు భాగాలు త్వరలో వెలువడనున్నాయి. సరళమైన వాడుకభాషలో, సుబోధకమైన శైలిలో రాశారు పుస్తక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్.
పేజీలు : 288