మన అంతరంగంలోని చిక్కుముడులకు సమాధానాలు ఈ మంత్రయోగం
మన గమ్యం ఏమిటో తెలుసుకోవడం కంటే మనం ఎవరం? ఎక్కణ్ణించి వచ్చాం? అందుకు మూలకారణం ఏమిటో అన్వేషించడం ప్రధానం.  సత్యం అనేది ఎక్కడో మబ్బుల్లో దాగిలేదు.  అది మనముందే తాండవిస్తుంది నిరంతరం.  కానీ ఆ సత్యాన్ని మనం మన అంతర్నేత్రంతో మాత్రమే చూడగలము.  ఈ మంత్రాలు మన అంతర్దృష్టిని తెరిపిస్తాయి.  ఆ అంతర్వివేచనంతో సాధారణమైనది అసాధారణంగా, అపవిత్రం పవిత్రంగా కనిపించి మన ఇంద్రియానుభూతి దివ్యానుభూతిగా మారుతుంది.
మంత్రంద్వారా యోగసిద్థి
జ్ఞానయోగం, భక్తియోగం, ధ్యానయోగంద్వారా మన జీవితం పరిపూర్ణమవుతుంది.  కేవలం జ్ఞానముంటే సరిపోదు.  జ్ఞానంలేని భక్తి పరిపూర్ణతను యివ్వదు.  అందుకే యీ మూడు యోగాలున్న మంత్రయోగం అత్యంత ప్రధానం.  మనలో జీవాత్మ, పరమాత్మలుంటాయి.  జీవాత్మ పరమాత్మతో ఐక్యమవటమే యోగం.  ఈ మంత్రాలను నిరంతరం అనుష్టించటంవల్ల యోగసిద్ధిని పొందగలము.
ఈ మంత్రాలను పఠించి, ఉపాసించి, సాధన చేయటం వలన శరీరానికి స్వస్థత కలుగుతుంది.  మనస్సు కుదుటపడుతుంది.  ఆత్మస్థైర్యం అలవడుతుంది.  ఒక దైవికశక్తి మనలో ప్రవేశిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good