"ప్రతికూల తత్త్వం ఉన్న మనస్సు ఆందోళనలతో, సందేహాలతో, దుస్థితిలో ఉంటుంది. అనుకూలతత్వం ఉన్న మనస్సు ప్రశాంతంగా, సర్వసమగ్రంగా, ఆనందంగా ఉంటుంది. అనుకూలతత్వం పరిజ్ఞానాన్ని నిదర్శనం." ప్రపంచానికి విశేష స్పూర్తినిచ్చే చైతన్య ముర్తులైన నాయకుల్లో శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఒకరు. మానవాళికి ఈ యుగం ప్రసాదించిన గొప్ప జ్ఞానుల్లో, మౌలిక ఆలోచన పరుల్లో గురూజి ఒకరు. వీరి ప్రసంగాలు విజ్ఞానాన్ని, దిశా నిర్దేశాన్ని నిరుపమానంగా మేళవించుకుంటాయి. అనితర సాధ్యంగా సారళ్యం, లలిత హాస్యం నింపుకున్న గురూజీ ప్రసంగాలు శక్తిమంతంగా భాసిస్తాయి. శ్రోతల హృదయాలను, జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. "మనో భూమికపై" ఇచ్చిన ప్రసంగాల సంపుటి ఇది.  మిక్కిలి ఆసక్తిదాయకమైన ఈ ప్రసంగాలు గాడంగా వున్నా సులభగ్రాహ్యంగా ఉన్నాయి. ఇవి లోతుగా పరిశీలింపచేస్తాయి. దీర్ఘంగా ఆలోచింపజేస్తాయి. అంతర్భావాలనుఅన్వేషింపజేస్తాయి. -శ్రీ శ్రీ రవిశంకర్

Write a review

Note: HTML is not translated!
Bad           Good