అందరికీ కావలసిన వ్యక్తిని గురించి, అందరికీ ఆదర్శనీయుడైన వ్యక్తిని గురించి, ఎంతోమందికి ఆచరణయోగ్యుడైన వ్యక్తిని గురించి వ్రాయడం వ్రాయబూనటం సాహితీలోకంలోనే అరుదైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఎందరికో ఉపయోగం వుంటుంది. ఎందరో తమ జీవితాల్ని సక్రమంగా మల్చుకునే అవకాశం వుంటుంది. తప్పుదారి పట్టకుండా క్షణం ఆగి ఆలోచించి సముచిత నిర్ణయాన్ని తీసుకునే వీలవుతుంది. ఎందరికో మార్గదర్శికం కాగల అవకాశముంటుంది. అందుకే ఈ ప్రక్రియ అరుదూ-అపూర్వం.
కోట్లాది అభిమానుల హృదయాలలో ఆరాధ్యనీయునిగా నీరాజనాలందుకునే కథానాయకుడ్ని గురించి తెలియని వారుండరు. ఐనా తెలియనివారికి తెలియని అంశాలనూ తెలిసినవారికి తెలుపవల్సిన అంశాలనూ, తెలిసీ తెలియని వారికి తేటతెల్లమయేలా తెలియజెప్పగల అంశాలను అక్కినేని పరంగా మరోసారి అక్కినేనిలో పరకాయప్రవేశం చేసి వ్రాయడం జరిగింది.
ఇది అక్కినేని అంతరంగమథనం. బాగుపడాలనుకునేవారి మెదడును పదునుపెట్టి జీవితం గురించి ఆత్మ పరిశీలన చేసుకొంటానికి అవకాశం కలిగించి అడుగు ముందుకు వేసే ముందు మంచిచెడులు గురించిన తర్కాన్ని మనసులో రేపే అవకాశాన్ని కలిగించేది -
ఎందరికో మార్గదర్శకం కాగలది - ఒక ప్రయోజనం కోసం వ్రాసినది ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good