కొండప్రాంతాలలో నివసించే ఒక వితంతు యువతి కథ ఇది. ఇందులో మనిషి యొక్క అనేక రూపాలను ఎంతో నైపుణ్యంతో చిత్రించాడు రచయిత. మన సంఘంలో ప్రబలివున్న వైరుధ్యాలనూ, తారతమ్యాలనూ వేలెత్తి చూపించాడు. మనిషి పరిస్థితులకు కేవలం బానిస అనీ, పరిస్థితులే అతని జీవితాన్ని నడిపిస్తాయనీ నమ్ముతాడు రచయిత.

యశ్‌పాల్‌ విప్లవవాది. అతను తన జీవితంలో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. అతని రచనల్లో సాంఘిక, రాజకీయ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరుపేదలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు, సాంఘిక చైతన్యం కలగజేసేందుకు అతను తన కలాన్ని శక్తివంతంగా ఉపయోగించారు.

పేజీలు : 314

Write a review

Note: HTML is not translated!
Bad           Good