నాకు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అసహ్యం. దానిని మానవ జాతి ఏ విధంగా అధిగమిస్తుందో ఎవ్వరికీ తెలీదని నేను అనుకుంటున్నాను. మార్క్సిజం పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించడానికి పనికి వచ్చినంతగా దానిని అధిగమించడానికి పనికి రాదని ఈ శతాబ్దం చరిత్ర రుజువు చేసిందని నా అభిప్రాయం. అది ఏ విధంగా జరగగలదో అర్థం చేసుకోవడానికి మూలాల నుండి పునరాలోచించాలని నేను అనుకుంటున్నాను. దీనికి జవాబు దొరుకుతుందని హామీ ఏమీ లేదు. అయినప్పటికీ అన్వేషణ జరపవలసిందే.

పెట్టుబడిదారీ వ్యవస్థతో సరిపెట్టుకోవడం అంటే మానవ జీవితాన్ని అనైతిక స్థాయిలో ఉంచి వేయడమే. మనుషుల మధ్య 'ఉపయోగం' అనేది తప్ప వేరే విలువలేవీ లేని జీవితంతో సరిపెట్టు కోవడమే. ఇది తగదని నా అభిప్రాయం
- కె. బాలగోపాల్

Write a review

Note: HTML is not translated!
Bad           Good