ఆర్థిక విధానాలు సిద్ధాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి? కొన్ని సిద్ధాంతాలు ఆయా చారి త్రక పరిస్థితులలోనే ఎందుకు పుట్టాయి? ఆనాటి సామాజిక జీవితంతో ఎందుకు పెనవేసుకుపోయాయి? ఏ విధంగా మార్పులకు లోనయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకు చారి త్రకాధారాలతో కూడిన సహేతుకమైన జవాబులు ఈ పుస్తకంలో లభిస్తాయి. కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పాలకవర్గాలను ఆశ్రయించిన వర్తకులు క్రమంగా పాలనా వ్యవహారాలలో పట్టును సాధించి, ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలు చేయించే, చేసే స్థితికి ఎలా ఎదిగారు? - అనే ప్రశ్నకి శాస్త్రీయమైన జవాబు లభిస్తుంది. నీరు మిట్టల నుండి పల్లానికి ప్రవహిస్తుంది. కాని సంపద గుంటల నుంచి గుంటల మీదికి ఎలా ఎగబాకుతుందో వివరిస్తుంది ఈ పుస్తకం. అంటే పెట్టుబడి పుట్టి ఈనాడు బహుళజాతి సంస్థలలో గుట్టలుగా పేరుకుపోయే స్థితికి ఎలా ఎదిగిందో వివరిస్తుందన్నమాట!

Write a review

Note: HTML is not translated!
Bad           Good