నేటి రష్యాలో ప్రపంచ ప్రఖ్యాతి నందగలిగిన కళాఖండాలేవీ సృష్టించబడలేదని బూర్జువా విమర్శకులు వాపోతుంటారు. కాని పుడోకిన్ 'మదర్, ఐనస్టీన్ 'బాటిల్ సీప్ పాటెమ్కిన్' లాంటి చిత్రాలు ఎవరు నిర్మించారు? మయకోవిస్కీ మహాకావ్యాలతో పోల్చదగిన కవిత్వం, షోలోహోవ్ రచించిన 'అండ్ క్వయిట్ ఫ్లోజ్ దాడాన్'తో సరితూగే నవల ఎవరు సృష్టించారు? అని ఆ విమర్శకులే రహస్యంగా ప్రశ్నించుకుంటూ వుంటారు' అంటూ శ్రీశ్రీ తన మాస్కోయాత్ర గురించిన ఉపన్యాసంలో ముచ్చటించిన 'మిహయీల్ షోలోహోవ్' రాసిన నవల ఇది. 'ది ఫేట్ ఆఫ్ ఎ మేన్' గా రాయబడిన ఈ నవలను శ్రీశ్రీ తెలుగులో 'మానవుడి పాట్లు' పేరున అనువదించారు.
పేజీలు : 29