పరమహంస యోగానందగారి ప్రసంగాల, వ్యాసాల కూర్పు, వారి ఒక యోగి ఆత్మకథలో లక్షలాది మందిని ఆకట్టుకున్న విశాలమయిన పరిధిగల, ప్రేరణాత్మకమయిన, సార్వజనీన సత్యాలను గురించిన లోతయిన చర్చను చేస్తుంది. వర్తమాన యుగంలో ఆధ్యాత్మిక జీవితంలో మనందరికీ విశ్వసనీయ మార్గదర్శకులు, పరమ పూజ్యులయిన ఈ రచయిత ప్రసంగాలు అన్నింటినీ ఆదరంతో స్వీకరించే వివేకమూ, ప్రోత్సాహమూ మానవ జాతిపట్ల ప్రేమల విశిష్ఠ కలయికతో, జీవంతో తొణికిసలాడటాన్ని పాఠకులు కనిపెడతారు. జీవితపు చిక్కుప్రశ్నలకు అర్ధం చేసుకోడానికి ప్రయత్నించే వారందరికీ, భగవంతుడి యదార్ధతను గురించి తమ హృదయాలలో అనిశ్చితమైన ఆశ ఉన్నవారికి, తమ అన్వేషణలో ఇప్పటికే భగవంతుడి వైపు తిరిగిన జిజ్ఞాసువులకు, ఈ ప్రసంగాల సంకలిత గ్రంథం ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని, ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించే నిశితదృష్టిని ఇస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good