మానవ సమాజం - నిన్నా - నేడూ - రేపూ - రంగనాయకమ్మ

ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు దాదాపు 30 సంవత్సరాల కాలంలో రాసిన (1975 నుంచి 2005 ఆగస్టు వరకూ) వ్రాసిన వ్యాసాలూ ఉత్తరాలూ, సమీక్షలూ, ఇంటర్వ్యూలూ, గతంలో వచ్చినవీ, రానివీ కలసిన సంపుటమిది. వీటిలో మొదటి వ్యాసం 'ఇంటి చాకిరీ ఏ రకం దోపిడీ' అనేది. ఇప్పటికి రాసిన చివరి వ్యాసం - 'వ్యభిచారానికి లైసెన్సులా?' అనేది.
ఈ సంపుటంలో మొత్తం విషయాలు 4,5, రకాలుగా ఉన్నాయి. స్త్రీల సమస్యమీదా, మార్కిృజం మీదా, పుస్తక సమీక్షలూ, సినిమా సమీక్షలూ, సంఘాలకూ పత్రికలకూ రాసిన ఉత్తరాలూ, ఇంటర్వ్యూలూ, పోలీసుల మీదా, ప్రభుత్వం మీదా - ఇలా ఈ సంపుటంలో కుండ బద్దలు కొట్టినట్లు, చాలా నిర్మొహమాటంగా వెలిబుచ్చిన అభిప్రాయాలున్నాయి.

ఇంటర్వ్యూలు అనేవి ముఖాముఖీగా జరిగినవి కావు. ప్రశ్నలు పంపితే జవాబులు రాసివ్వడం చేశారు.
అవసరమైన ప్రతి చోటా కొత్త ఫుట్‌ నోట్లు ఇచ్చారు. ఈ సంపుటంలో మొత్తం 23 ఫుట్‌ నోట్లు వున్నాయి. 11 వ్యాసాలకు చివర, 'కొత్త మాట' పేరుతో కొత్త వివరాలు చేరాయి. ఆవిడే గతంలో రాసిన 5 చిన్న పుస్తకాలను కూడా ఈ సంపుటంలో చేర్చారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good