సుందరమ్మగారు జమిందారిణి. ఆమెకు భర్త, కొడుకు, కోడలు, మనవడు వున్నారు.
చంద్రుని చుట్టూ చుక్కలున్నా, చంద్రుడికి చుక్కలకూ పొత్తులేనట్లే ఆమె చేతిలో కీలుబొమ్మలే వారు. ఓ రకంగా వారంతా పగటి నక్షత్రాలు. అరుణ ఆత్మాభిమానం గల యువతి. సుందరమ్మ తన మనవడికి అరుణను చేసుకోవాలనుకుంటుంది. కానీ, ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని భరించలేని సుందరమ్మ అరుణను తిరస్కరిస్తుంది.
చీకటికి సూర్యోదయంలాగా అరుణకు రాజారావు తటస్థపడతాడు.
సావిత్రమ్మ డబ్బుతో మనుషులను కొనవచ్చనుకుంటే రాజారావు అల్లరిపెట్టి మనుషులను లొంగదీసుకోవచ్చు అనే తత్త్వం గలవాడని అరుణ అనుమానిస్తుంది. ఈ రాజారావు కూడా ఆమె మొదటి కోడలు కొడుకే. అయితే పిచ్చిచెట్లతోపాటు గంథం చెట్లుకూడా అడవిలోనే వుంటాయని అరుణ గ్రహించలేదు.
రాజారావును అనేకవిధాల పరిశీలించాక అరుణ మానసవీణ మ్రోగుతుంది.
ప్రేమాభిమానాలు ఒకరిచ్చేవికాదు, తీసుకునేవి కాదు. అవి మనసులో నుండి రావాలి.
అంతే జరిగింది.
శ్రీమతి మాలతీ చందూర్‌ మరో మరుపురాని, మరువలేని నవల ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good