కొత్త శక్తిని తెచ్చుకుని, పాత ఆలోచనాధోరణులను మార్చుకుని యితరుల అవసరాలకు అనుగుణంగా మనం మారితే యెలాగుంటుంది?

మనం నిజంగా అలా మారగలం. అందుకీ పుస్తకం మార్గాన్ని చూపిస్తుంది. ఏకనాథ్‌ ఈశ్వరన్‌ మంత్రం చుట్టూ అలముకున్న రహస్యాల్ని తొలగిస్తారు. శక్తివంతమైన, కాలం చేత నిరూపించబడిన పద్ధతిలో దాన్ని ఉత్కృష్టమైన సాధనంగా మలచుకోవడానికి ప్రతిక్షణాన్నీ ఒక కొత్త అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో సావధానంగా చెబుతారు.

హానికరమైన అలవాట్లను వదులుకోండి.

ఒత్తిడిని జయించండి.

నిరాశల్ని అధిగమించండి.

వ్యక్తిగతమైన సంబంధాల్ని పునరుద్దరించుకోండి.

అంతర్గత సంఘర్షణల్ని రూపుమాపండి.

జీవితపు ఆధ్యాత్మిక భూమికను గుర్తించండి.

ఈ చిన్న పుస్తకం స్పష్టంగానూ, హృద్యంగానూ రాయబడింది. యిది మంత్రానికుండే శక్తినీ, ఉపయోగాన్నీ స్పష్టంగా, నిర్దుష్టంగా వివరిస్తుంది. - ఛాయిస్‌.

మంత్రమెలా పనిచేస్తుంది, ఒక మంత్రాన్నెలా ఎన్నుకోవాలి, దాన్నెలా వాడుకోవాలి - మీ జీవితాన్నెలా మలచుకోవాలి? యీ పుస్తకంలో యీ ప్రశ్నలకంతా సమాధానాలున్నాయి. దీన్ని చదవడం గొప్ప ఆధ్యాత్మికమైన సార్వజననీయమైన మహదానుభవాన్నిస్తుంది. - డా|| టామ్‌ ఫెర్గూసన్‌, ప్రఖ్యాత వైద్యుడు

Pages : 118

Write a review

Note: HTML is not translated!
Bad           Good