గాంధీజీ అంతగా మ¬న్నత వ్యక్తిగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ గౌరవించబడిన వ్యక్తులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అయితే ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు పలు సందర్భాలలో వివాదాలకు దారితీశాయి. (అయితే - ఆయనను సైద్ధాంతికంగా వ్యతిరేకించినవారు కూడా వ్యక్తిగా ఆయనను గౌరవించడం మరింత అరుదయిన విషయం. వాటిల్లో ఆయన బ్రహ్మచర్య ప్రయోగాలు, భగత్‌సింగ్‌ విషయంలో ఆయన వైఖరి, నిమ్నజాతుల విషయంలో ఆయన ధోరణి) ప్రత్యేకించి వర్ణాశ్రమ ధర్మం విషయంలో ఆయన ధోరణి - ఆర్థిక సిద్ధాంతాలు మొ|| కొన్నింట కనబడే వెనుకబాటు ధోరణి, మతం విషయంలో ఆయన అభిప్రాయాలు, మొదలయినవి ప్రత్యేకించి పేర్కొన దగ్గవి. దీనికి తోడుగా - తండ్రిగా పిల్లల విషయంలో ఆయన బాధ్యత నెరవేర్చిన తీరు ఎట్టిది? - ఆయన ఫెమినిస్టా, సనాతనిస్టా?- భార్య విషయంలో ఆయన వైఖరి ఎలాంటిది? - అనే విషయాలలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీజీ అంతగా అపార్థాలకు గురి అయిన వ్యక్తులు మరొకరుండరు.

-  రచయిత కోడూరి శ్రీరామమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good