"ప్రపంచమంతటా సాగిన విప్లవాల ఆధారంగా, ఇక్కడి మన పోరాటాల ఆధారంగా విజయాలని, వైఫల్యాలని, సూత్రబద్దంగా అంచనా వేయటానికి విప్లవకారుల మధ్య సాగుతున్న ప్రయోజనకరమైన ఈ మహత్తర చర్చ - కాలక్రమంలో దేశంలోని విప్లవ శక్తులని తప్పక ఐక్యంచేసి తీరుతుంది. ఈ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కేవలం విజయాల పరంపరగా ఎన్నడూ ఉండజాలదు. ఏ విప్లవంలోనూ అలా జరగలేదు. విప్లవ విజయం తధ్యం."
- కా" టి.ఎన్
"తెలుగు కవిత్వంలోకి శ్రామికవర్గ దృక్పధాన్ని, మార్క్సిస్టు తాత్త్వికతను తొలిసారిగా బలంగా ప్రవేశపెట్టినవాడు మహాకవి శ్రీ శ్రీ. రెండు వైరి వర్గాల మధ్య రెండు వైరి ప్రపంచాల మధ్య గిరిగీసి విప్లవ కవిత్వ రంకె వేశాడు. సామ్యవాద సమాజ ఆశయాన్ని, లక్ష్యాన్ని ప్రశ్నించ వీలులేని విధంగా తెలుగు కవిత్వాన్ని మున్ముందుకు నడిపించాడు."
- డా" బి. సూర్యసాగర్