ఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం వేయి సంవత్సరాల నాటిదని విజ్ఞులు చెపుతున్నారు. ఇంతటి మ¬న్నతమైన మన తెలుగు జాతి భాషా సంస్కృతులు కాలగతిలో అనేక చారిత్రక సందర్భాలలో ఎన్నో ఆటుపోటులకు గురి అయింది.

 ఆధునిక కాలంలో పాశ్చాత్య సాహిత్య, సాంస్కృతిక ప్రభావంతో భారతదేశంలోని మిగతా భాషల మాదిరిగానే మన తెలుగు భాషలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే భాష ప్రవహించే ఒక నదివంటిదన్నారు. పాత నీరు కొట్టుకొని పోయి, కొత్త నీరు వచ్చి చేరినట్లుగా, భాషలో పాత పదాలు మార్పుకు లోనై, కొత్త పదాలు వచ్చి చేరుతుంటాయి. ఇది ఒక రకంగా భాషాపదజాలాన్ని సుసంపన్నం చేస్తుంది.

 రేడియో మాధ్యమం చదువురాని వారికి కూడా విజ్ఞానాన్ని అందించే ఏకైక సాధనం. ఇది అందరికీ అందుబాటులో ఉండేది. దీని ద్వారా ప్రయోజనాత్మకమైన కార్యక్రమాలను రూపొందించి ప్రజలకు అందించాలనే సత్సంకల్పంతో అప్పట్లో హైదరాబాదు కేంద్రంలో పనిచేసిన డా. నాగసూరి వేణుగోపాల్‌, కె.పి. శ్రీనివాసన్‌ గార్లు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. పరమ ప్రామాణికము, ప్రజోపయోగమైన ఈ ప్రసంగాలు సంకలన పరచి వెలువరిస్తే ఎంతో ఉపయుక్తమని ప్రస్తుత ఆకాశవాణి చెన్నై కేంద్రం ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ డా.నాగసూరి వేణుగోపాల్‌ వీటిని పంపుతూ సూచించారు. భాషకు సంబంధించిన ఈ ప్రసంగాలు విషయ ప్రాధాన్యంతోపాటు విలువను కూడా కలిగి ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good