ఈ 'మన (సు) కథలు' కథాసంపుటిలో 12 కథలున్నాయి. అన్నీ వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేవే. శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారు సమాజంలోని సమస్యల వాస్తవిక స్వరూపాన్ని కళ్లకుకట్టినట్లు చిత్రించడమే కాకుండా వాటి పరిష్కారాన్ని కూడా సూచించడం వారి విశిష్ట విశ్లేషణ గుణానికి నిదర్శనం. వారి కథల్లోని స్త్రీ పాత్రలు స్వతంత్ర భావాలతో స్వేచ్ఛగా ఆలోచిస్తాయి. స్వయంగా నిర్ణయాలు చేస్తాయి. సంప్రదాయాలను గౌరవిస్తూనే ప్రయోగశీలమైన అభ్యుదయ భావాలతో పురోగమిస్తాయి. - ఎం.కె.రాము

    ఈ కథా సంకలనం సామాజిక సమస్యలతో పాటు విభిన్న పరిస్థితులలో - సమాజంలో వ్యక్తులుగా మనం ఎలా స్పందిస్తే బావుంటుంది..? అన్న ప్రశ్న నాలో ఉదయించి నా వంతుగా స్పందించి రాసినవి. ఆ కథలు ఏఒక్క కులానికో వర్గానికో చెందినవి కావు. ఎవరినీ ఉద్దేశించి రాసినవీ కావు.

    స్త్రీ హృదయం అనాదిగా అందరూ భావించినట్లు కేవలం కుసుమ కోమలం మాత్రమేకాదు. జీవితంలో సంభవించే ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగల సామర్థ్యం 'స్త్రీ' కి ఉన్నదని నిరూపిస్తూ - విభిన్న ఇతివృత్తాలు తీసికొని కథలుగా మలచడం జరిగింది. చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పే క్రమంలో కథల నిడివి కాస్త పెరిగినా... కథావస్తువుకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good