తెలుగు వారికి సుదీర్ఘ చరిత్రతో పాటు, విలక్షణమైన సంస్కృతి కూడా ఉంది. ఆ సంస్కృతిలో శిల్పం ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొంది. శిలాయుగంలోనే తెలుగు నేలపై చిత్రకళ పురుడుపోసుకోగా, క్రీ.పూ. 5వ శతాబ్దంలో ఇనుపయుగపు ప్రజలు, తమ పూర్వీకుల శిల్పాలు చెక్కి శిల్పకళకు నాంది పలికారు. శాతవాహన కాలంలో పరిఢవిల్లిన బౌద్ధ సంస్కృతి శిల్పాల్లోనే నిక్షిప్తమై వుంది. అమరావతి శిల్పకళగా గుర్తింపుపొంది సమకాలీన గాంధార, మదుర శిల్ప శైలులకంటే ఔన్నత్యాన్ని సంతరించుకొని ప్రపంచఖ్యాతి నార్జించింది. అమరావతి స్థూపం చుట్టూ అలంకరించబడిన శిలాఫలకాలతో ప్రారంభమై, విజయనగర కాలానికి మహోన్నత స్థితికి చేరుకొంది తెలుగువారి శిల్పకళ. ఏ ఆలయానికెళ్ళినా అక్కడి శిల్పసౌందర్యాన్ని చూచి మైమరచిపోని వారుండరు. శిల్పులను తలచుకోని వారుండరు.

గుళ్లు, గోపురాలను చూచినప్పుడు, వాటిని కట్టించిన రాజుల శాసనాలు కనిపిస్తాయి గానీ, చెక్కిన శిల్పుల పేర్లు అంతగా కనిపించవు. ఎన్నో శాసనాలు పరిశీలిస్తేనేగాని కొంతమంది శిల్పుల పేర్లైనా దొరకవు.

రచయిత శివనాగిరెడ్డి ప్రాకృత, సంస్కృత, కన్నడ, తెలుగు శాసనాలను పరిశోధించి, బౌద్ధశిల్పులు, ఇతర శిల్పుల గురించిన చాలా సమచారాన్ని సేకరించి ఈ పుస్తకంలో అందించారు.

Pages : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good