పిల్లలూ, పెద్దలూ, తమ దేహం గురించి తెలుసుకొని ఆరోగ్యంగా వుండేందుకు ఉపయోగపడే అత్యద్భుతమైన మానవ శరీర నిర్మాణశాస్త్ర పుస్తకం!

ఈ పుస్తకం మానవ శరీరం వివరాలను ఒక కథలాగ చెపుతుంది.

ఒక రోజులో తిండి అన్నిసార్లు ఎందుకు తినాలి? ఎందుకంటే తిండి, నీళ్లూ లేకుండా బతకడం వీలుకాదు కనుక.

శరీరం లోపల ఏముంది?

గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, ఇంకా మెదడు లాంటివి ఎలా పనిచేస్తాయి?

ఎందుకని కొన్నిసార్లు నీ కళ్లు చెప్పినట్లు వినవు? కళ్లు ఎందుకని బరువెక్కి మూసుకుంటాయి?

ఎందుకని ఒకసారి ఆరోగ్యం పాడైనట్టు అనిపిస్తుంది? డాక్టర్‌ సాయం ఎందుకు అవసరం అవుతుంది?

శరీర భాగాలు బాగా వుండి, బలంగా వుండాలంటే నీవు ఏం చేయాల్సి వుంటుంది?

ఈ ప్రశ్నల్లో చాలావాటికి నీవు సరైన సమాధానం చెప్పలేవని నాకు తెలుసు. అయినా అవన్నీ నీకు, నీ శరీరానికి సంబంధించినవే.

అందుకే, ఈ పుస్తకం రాసింది. ఇందులో నీ శరీరం గురించి నీవు తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయాలు వున్నాయి. - పి.రాజేశ్వర రావు

Pages : 68

Write a review

Note: HTML is not translated!
Bad           Good