''జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడి ఉన్నది. ఆ పోరాటంలో ప్రజల చేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవ సాహిత్యం. ఇందుకు అంగీకరించని వారు జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడలేదని రుజువు చెయ్యాలి. చెయ్యలేరు.'' అంటూ రాజకీయాలకూ జీవితానికీ, రాజకీయాలకూ సాహిత్యానికీగల సంబంధాన్ని తెలియజేస్తూ, రచయితనేవాడికి స్పష్టమైన రాజకీయ దృక్పథం ఉండి తీరాలని చెప్పిన నిబద్ధ సాహితీవేత్త, ఆధునిక తెలుగు సాహిత్య మార్గ దర్శకుడు, భావవిప్లవకారుడు కొండవటిగంటి కుటుంబరావు.

ఇది కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి (1909-2009) సంవత్సరం. ఈ సందర్భంగా, వివిధ సందర్భాల్లో మహాకవి శ్రీశ్రీ ఆయనపై రాసిన వ్యాసాలూ, చేసిన ఉపన్యాసాలూ, కామెంట్సూ, కాంప్లిమెంట్సూ కలిపి 'మన కొడవటిగంటి' పేరుతో పుస్తకంగా వెలువరిస్తున్నాం. ఈ పుస్తకం ఆ కలంయోధునికి శ్రీశ్రీ అక్షరాల నివాళి.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good