ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో 1895లో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచమంతా పర్యటించి, వివిధ దేశాల ప్రజల జీవనశైలినీ, ఆలోచనా సరళినీ ప్రభావితం చేసిన అత్యంత ఆధునిక తత్వవేత్త. అశాంతితో, సంఘర్షణతో నిండిన నిత్య జీవితాన్ని ముఖాముఖీగా ఎదుర్కొనే సాహసాన్నీ, నిర్భీతినీ మనలో కృష్ణమూర్తి బోధనలు జ్వలింపజేస్తాయి. ధ్యానం స్వీయ ఆవిష్కరణకు తలుపులు తెరుస్తుంది. మనసునూ, ఆలోచనలనూ అనాసక్తంగా పరిశీలించడంలోనే వాటినుండి స్వేచ్ఛ లభిస్తుంది. మౌనస్థితిలోనే నిశ్శబ్దలోకపు అనంతాలలో అజ్ఞేయమైన దానిని దర్శించడం జరుగుతుంది. అపూర్వమైన తీరులో అసలైన ధ్యానం అంటే ఏమిటో విశదీకరిస్తూనే చేతనా వర్తపు అంచులను కరిగించి వేస్తారు - ''జె.కృష్ణమూర్తి''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good