ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో 1895లో జిడ్డు కృష్ణమూర్తికి జన్మించారు. మానవాళిని బాధావిముక్తం చేయడమే తమ ఏకైక కర్తవ్యంగా జీవించిన ఋషితుల్యులుగా కీర్తించబడ్డారు. వారి ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా విఖ్యాతి పొందాయి. అద్భుతమైన సౌందర్యంతో నిండిన జీవితాన్ని మనిషి ఎందుకు సమస్యలమయం చేసుకుంటున్నాడనే ఆవేదనతో ఈ బాధలకు, దు:ఖాలకు మూలకారణాలను అన్వేషించి చూపారు. జె.కె. మనసులోని చేతన, అచేతన పొరలను ఒక అపూర్వమైన తీరులో ఆవిష్కరించి చూపి, శ్రోతల చేత స్వయంగా తమ తమ అంతరంగాల శోధన చేయిస్తారు. ఈ పుస్తకంలో లండన్‌, ఏంస్టర్‌డామ్‌, ప్యారిస్‌ నగరాలలో, స్విట్జర్లాండులోని సానెన్‌లో చేసిన ఎనిమిది ప్రసంగాలు వున్నాయి. శ్రోతల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు - సందేహాలతో సతమతమవుతున్న ప్రతిఒక్కరికీ ఆసక్తికరంగా ఉంటాయి. ఒక నవ్యదృష్టికీ, నూతనోత్తేజానికి ఆరంభం పలుకుతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good