మన దేహం కథ - డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబ్ట్సెట్రిక్స్‌లో నిపుణులైన వీరు కాకినాడలో ''విజయలక్ష్మినర్సింగ్‌ హోమ్‌'' ప్రారంభించి వైద్యసేవ చేస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలోకూడ ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు - మీరు ప్రేమించలేరు. మాకీ భర్త వద్దు. పేషెంట్‌ చెప్పే కథలు, అగ్ని కిరణం - కథాసంపుటాలు : సజీవ స్వప్నాలు, చైతన్య దీపాలు, ప్రత్యూష పవనం - వెలుతురు పువ్వులు - నవలలు : మాతృత్వం - ప్రసూతి సమస్యలు - సలహాలు వైద్యవ్యాస సంపుటి. వైద్యుడు లేనిచోట - అనువాద గ్రంథం - ఇవన్నీ తెలుగు పాఠకులకు చిరపరిచితాలే.

తెలుగు పాఠకులకు డాక్టర్‌ విజయలక్ష్మిగారి మరో వినూత్నకానుక - ఇప్పుడు మీ చేతిలో ఉన్న పుస్తకం మన దేహం కథ

Write a review

Note: HTML is not translated!
Bad           Good