సాంస్కృతిక విప్లవం కూడా వర్గపోరాటమనే మౌలిక సూత్రాన్ని హింటన్‌ వెలుగులోకి తీసుకువచ్చారు. రెండు పంథాల మధ్య పోరాటం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, మార్క్సిస్టు లెనినిస్టు పంథాకు, మార్క్సిస్టేతర అవకాశవాద పంథాకు మధ్య జరిగిన భావజాల పోరాటంగా విశ్లేషించారు. కొందరు పాశ్చాత్య విమర్శకులు చెప్పినట్లుగా సాంస్కృతిక విప్లవంలో సైన్యం కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోలేదని, అందుకు బదులు విప్లవ వారసత్వాన్ని కొనసాగించి, చైనాను పెట్టుబడిదారీ పంథాకు మళ్లించడాలనే విప్లవ ప్రతీఘాతుక శక్తులను ప్రజాశక్తులు నిలువరించాయని ఆయన అనుభవం నుండి నిగ్గుతేల్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో తలెత్తిన విప్లవ ప్రతీఘాతుక ముఠాల కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన బహిరంగ విమర్శనా పోరాటంగా దాన్ని ఆయన ఈ పుస్తకంలో చిత్రించారు. శ్రామికవర్గ అగ్రగామి దళమైన కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన్నే విప్లవం విజయవంతం అయినట్లు భావించకూడదని, ఆ తదనంతరం కూడా అధికారాన్ని కోల్పోయిన పాత బూర్జువాశక్తులు చాపకింద నీరులా తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తూ తిరిగి అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేస్తాయని సాంస్కృతిక విప్లవం ప్రపంచానికి చాటి చెప్పింది. విప్లవోద్యమంలో ప్రముఖ పాత్రవహించిన కమ్యూనిస్టు నాయకులు కూడా తరువాత కాలంలో అన్యవర్గ భావజాలానికి గురై కమ్యూనిజానికి శత్రువులుగా మారుతారని సాంస్కృతిక విప్లవం నిరూపించింది. సోసలిస్టు దశ అంతా నిరంతర వర్గపోరాటమే  వీటన్నింటికి పరిష్కారమని సాంస్కృతిక విప్లవం తెలియజేసింది. - సి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌

పేజీలు : 107

Write a review

Note: HTML is not translated!
Bad           Good