ఆర్కే నారాయణ్‌ కథలు చదువుతూంటే మనందరికి తెలిసిన ప్రదేశాలనే కొత్త అద్దాల నుంచి చూస్తున్నట్టుంటుంది.  మనందరికీ తెలిసిన మనుషుల్లోనే ఇంతవరకు గమనించని వింతలను చూస్తున్నట్టుంటుంది.  మనందరికీ తెలిసిన సన్నివేశాల్లోనే అనుకోని మలుపులు చూస్తున్నట్టుంటుంది.  అతి సాధారణంగా చెప్పిన అసాధారణమైన కథలు ఇవి. మాల్గుడీ అనే కల్పిత పట్టణంలోని ప్రతి సంఘటనా, ప్రతి చమత్కారమూ, ప్రతి అనుభవమూ, ప్రతి కలయికా, ప్రతి వీడ్కోలు, ప్రతి బాధా, ప్రతి ఆనందమూ మనవే అన్నట్టుంటుంది.  అక్కడి ప్రతి వ్యక్తీ మనవాడే ప్రతి వ్యవస్థా మనదే.  ఇంకా చెప్పాలంటే మనల్ని మనం అక్షరాలలో చూసుకుంటున్నట్టుంటుంది.  చదివేకొద్దీ మనం కూడా మాల్గుడీలో ఎప్పుడో ఒకప్పుడు విహరించామన్న భ్రమ కలుగుతుంది.  ఇంకా విహరించాలన్న కోరిక కలుగుతుంది. - మృణాళిని

Write a review

Note: HTML is not translated!
Bad           Good