రాజగోపాల్‌ డాన్సర్‌ సురేఖను ప్రేమించి పెద్దల బలవంతంతో కృష్ణవేణిని చేసుకున్నాడు.
ఓ మూడేళ్ళ కాపురం ఫలితంగా సీత పుట్టింది.
ఈ మూడేళ్ళలో అతను కృష్ణవేణితో మాట్లాడిన మాట లేదు. యాంత్రికంగా మూడేండ్లు గడిచిపోయాయి.
ఓ రోజు తల్లి, దండ్రి, భార్య, పిల్ల, చెల్లెండ్రును ఒదిలి సురేఖ దగ్గరకి వెళ్ళాడు.
అంతే! మళ్ళీ తిరిగి రాలేదు.
తన మనసు చంపుకుని ఆ పరిసరాల్లో కూరుకుపోక, తెగించి యిక్కడ వుండిపోవడం రాజగోపాల్‌ తన జీవితంలో చేసిన మహత్తరమైన నిర్ణయంగా అనుకుంటున్నాడు. అతనికి అశాంతి, అసంతృప్తి లేవిపుడు. తాను కోరినది పొందగలిగాడు ఇంతకు మించి తనకేమీ అక్కరలేదు.
సురేఖ తనూ కలిసి నిర్మించుకున్న యీ జీవితం సౌరభమయింది. కళాత్మకమైంది. అని గర్వం కూడా వుంది అతనిలో.
కానీ సురేఖ హఠాణ్మరణంతో కృష్నవేణి తిరిగి అతని జీవితంలో ప్రవేశించింది. ఆమె అవసరం యీనాడెంతైనా అతనికుంది.
ఏమిటీ జీవితాలు?
శ్రీమతి మాలతీ చందూర్‌ మరో మరుపురాని నవల ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good