నేడు యువత, గతాన్ని వర్తమానాన్నీ అర్థం చేసుకుని, భవిష్యత్తును అవగాహన చేసుకోవటానికి, అది ఏ రంగంలో అయినా మార్క్సిజానికి మించిన జ్ఞానం మరోటి లేదనేది ఘంటాపథంగా చెప్పవచ్చు.

మార్క్సిజం పిడి సూత్రం కాదు. కార్యాచరణకు అది మార్గదర్శి అనే విషక్ష్మీం జగమెరిగిన సత్యం. అందువల్ల మార్క్సిజాన్ని దాని అభివృద్ధి, చలనం, కార్యాచరణలతో అధ్యయనం చేయాలి. అందుకు మార్క్స్‌ జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది.

మార్క్సిజం కమ్యూనిజం అనగానే రక్తపాతమని విప్లవం, సంఘర్షణ, యుద్ధం, పోరాటం అనే పదాలు మాత్రమే మన ముందు కదలాడతాయి. అత్యంత సున్నితమైన మానవీయమైన, కళాత్మక హృదయం కలిగి వున్నందు వల్లనే అశేష ప్రజానీకపు బాధలకు వాస్తవిక కారణాలను కనుగొనేందుకు తన జీవితాన్ని వెచ్చించగలిగాడు మార్క్స్‌. అంటే అతని సిద్ధాంతం అశేష ప్రజానీకాన్ని వారనుభవిస్తున్న బాధల నుండి విముక్తం చేసేదని, మానవీయ సమాజాన్ని నిర్మించేదని, దోపిడిదారున్ని కూడా మానవీయునిగా నిలబెట్టేదని గ్రహించాలి.

పేజీలు :56

Write a review

Note: HTML is not translated!
Bad           Good