ఉత్తమ వ్యక్తిత్వం మీద, వ్యక్తిగత విజయాలమీద, అత్యంత విశ్వసనీయమైన, ఆచరణీయమైన సలహాలు, సాధనాలు అందించే రచయిత రాబిన్‌ శర్మ రచన  ఇది. మహోన్నతికి మార్గం గురించి మరి కొన్ని అద్భుత సలహాలు ఇచ్చే ఈ గ్రంథం మీకు అనేక విధాలుగా మార్గదర్శనం చేస్తుంది.

- వ్యక్తిపరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రపంచస్ధాయి అందుకోవడానికి

- నిర్ఘాంతపరిచే విజయం ఎలా సాధిఆంచాలో నేర్చుకోవడానికి

- అసాధారణ జీవితం గడపడానికి కావలసిన స్ఫూర్తి, ఆకాంక్ష, ఉత్సాహం పొందటానికి

- ఆనందాన్ని శోధించి, అందుకుని, మరింత సరదాగా జీవించడానికి

- కష్టకాలంలో ధైర్యం, హుందాతనం ప్రదర్శించడానికి

- వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవితాలను సరళతరం చేసుకోవడానికి

ఈ పుస్తకం మీలో శక్తిని నింపుతుంది. అసాధారమైన సలహాలనిస్తుంది. ఉదాత్త స్ధితికి తీసుకువెళుతుంది. చివరకు మీరు ఎంత గొప్పగా ఉంటారంటే ఎదుటివారు మిమ్ముల్ని పట్టించుకోకుండా ఉండలేనంత. అడంగందే అమ్మయినా పెట్టదని, త్వరగా సఫలం కావాలని, కూల్‌గా ఉండాలని, గాఢంగా జీవించాలని ఈ పుస్తకం చెబుతుంది.

జీవితాన్ని మరింత అందంగా, తెలివిగా, జీవించడానికి ఒక నిబంధనా పత్రంలా, కార్యాచరణ ప్రణాళికలా ఉండే ఈ పుస్తకంలో రాబిన్‌శర్మ మీ కోసం 101 సరళమైన, శక్తివంతమైన పాఠాలు పొందుపరిచారు. ప్రపంచస్ధాయికి ఎదగడం అన్నది ఒక్క అడుగుతోనే ప్రారంభమౌతుంది. పదండి ఈ రోజే మొదలు పెట్టండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good