మహోజ్వల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నవలా సాహిత్యం - పరిచయాలు - పరిశీలన
'మహత్తరమైన చారిత్రక రైతాంగ సాయుధ పోరాటం ఒక నికృష్టమయిన, మధ్యయుగాల నాటి నిరంకుశ పరిపాలనను సాగిస్తున్న అసఫ్‌ జాహి రాజవంశపు పాలన యొక్క కూకటి వ్రేళ్ళను కుదిపివేసి, ఆ నిరంకుశ రాజ్య వ్యవస్థపై చావుదెబ్బ కొట్టింది.  ఈ రకంగా యీ తెలంగాణా ప్రజా సాయుధ పోరాటం కేవలం తెలంగాణా ప్రజలకే కాక మొత్తం భారత దేశ ప్రజలకు ఒక నూతన ప్రజాస్వామిక విప్లవపంథాను అందజేసింది.
అటువంటి మహత్తర పోరాటం అనేక ఎగుడుదిగుళ్ళకు గురవుతూ, వంకటింకర మార్గం గుండా పయనించింది.  ఈ పోరాటంలో వివిధ సెక్షన్లు, వివిధ ఆచార వ్యవహారాలూ, వివిధ మనస్తత్వాలూ, వివిధ అభిప్రాయాలూ, వివిధ స్థాయిల అవగాహనలూ, భావాలు గల లక్షలాది మంది బహుముఖంగా పాల్గొన్నారు.  వీటన్నిటినీ ప్రతిబింబిస్తూ, చారిత్రక వాస్తవికతనూ, సత్యాన్నీ పాటిస్తూ; ఆ పోరాట విశిష్టతనూ, సంక్లిష్టతనూ చిత్రీకరిస్తూ ఒక గాధగా (ఒక నవలగా) మలచటం అన్నది బహుకష్ట సాధ్యమయిన, క్లిష్టమైన ప్రయాస.'
ఈ పుస్తకంలోని నవలా రచయితలు, సంస్థలు తరతమ స్ధాయిలలో శ్రమించి ప్రజలకందు బాటులోకి తెచ్చారు.  పోరాట కాలం నుంచి ఇటీవలి కాలం వరకు వచ్చిన, లభించిన 20 నవల పరిచయాలు, పరామర్శలు, విశ్లేషణలు 15 మంది రచయితలు వ్యాసాల రూపంలో అదించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good